సత్యయుగంలో ధర్మం నాలుగుపాదాలా నడిచే కాలంలో ఎక్కడో ఒక దుష్టశక్తి రాక్షస రూపములో జన్మించి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి, అల్లకల్లోలం సృష్టించే సమయంలో, మన ధర్మాన్ని, ప్రజలను కాపాడడం కోసం స్వయంగా అమ్మవారే అనేక రూపాలలో అవతరించి దుష్టసంహారాన్ని గావించారు.
కానీ ఈ కలియుగంలో ధర్మం ఒంటికాలిపై నడుస్తున్నది, అప్పటిలా రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనే, మనతోనే ఉన్నారు. అలాగే ఇప్పటి అమ్మాయిలు అబలలూ కారు, ధైర్యసాహసాలను, మేధాసంపత్తులను ఆయుధాలుగా చేసుకుని ఏ రంగంలోనైనా దూసుకుపోగలిగే శక్తిస్వరూపాలు. స్వయంగా అప్పటి ఆదిశక్తి అవతారాలే మన హిందూ ధర్మంలో పుట్టిన ఆడబిడ్డలా అనేంతలా వెలుగుతున్నారు. కానీ ఇది సరిపోదు. ప్రతి ఆడబిడ్డా తనని తాను దైవస్వరూపముగా భావిస్తూ, తన కుటుంబాన్నే కాక దేశాన్నీ, ధర్మాన్నీ కూడా కాపాడుకుంటూ ముందడుగు వెయ్యాలి. ఆలా ముందడుగు వేసిన కొందరు ఆడబిడ్దల ధైర్యసాహసాలను, వీరపరాక్రమాలను సరికొత్తగా మీ ముందుకి తేవడానికి చేసిన చిరుప్రయత్నమే ఈ పుస్తకం.
Be the first to review “Navaratri | నవరాత్రి”